fbpx
Home Cinema Bollywood నీ కన్యత్వం ఎప్పుడు పోయింది? ఇలియానాని...

నీ కన్యత్వం ఎప్పుడు పోయింది? ఇలియానాని…

ఇలియానా రిప్లైకు గురుడుకు గుండె పేలిపోయింటుంది

సోషల్ మీడియా బాగా పెరిగిపోవటం అనేది సెలబ్రెటీలకు ప్లస్ అవుతోంది..మరో ప్రక్క అదే మైనస్ గానూ మారుతోంది. మరీ ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో తామెవరమో తెలియదు కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం, సిగ్గువిడిచి జుగుప్సగా ఇతరులతో ప్రవర్తించటం వంటివి చేస్తున్నారు. అయితే సెలబ్రెటీలు కూడా ఊరుకోవటం లేదు. వారికి చెప్పు పుచ్చుకు కొట్టిన రీతిలో రిప్లై ఇస్తున్నారు. తాజాగా ఇలియానాకు ఇలాంటి సంఘటన ఎదురైంది.

రీసెంట్ గా ఇలియానా #AskMeAnything (ఏమైనా అడగండి) అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. చాలా మంది ఫ్యాన్స్ ఆమె తర్వాతి సినిమా, ఇష్టాలు, అయిష్టాలు లాంటి అంశాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఓ యూజర్ మాత్రం ఇలియానా వర్జనిటీ గురించి ప్రశ్నించారు.

మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు? అంటూ అడిగితే…. వెంటనే ఇలియానా తనదైన శైలిలో అతడి నోరు మూయించే ప్రయత్నం చేసింది. ‘ఈ విషయంలో మీ అమ్మ ఏం చెబుతుందో ముందు అడిగి తెలుసుకో’ అంటూ రిప్లై ఇచ్చింది.

దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇలియానా.. ఆ తర్వాత ‘పోకిరి’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. … ఆ తర్వాత తన మకాం బాలీవుడ్‌కు మార్చింది. అయితే అక్కడ ఈ గోవా భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు, గుర్తింపు రాలేదు. అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటున్న ఇల్లీ బేబీ చివరి చిత్రం ‘రైడ్’ 2018లో విడుదలైంది. ఇక తన బాయ్‌ ఫ్రెండ్ బ్రేకప్ చేప్పాకా.. అవకాశాల కోసం దర్శక, నిర్మాతలు చుట్టూ తిరుగుతోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ