fbpx
Home Cinema ఇంటికి పిలిచి తడిమేసాడు.. నటుడి అరెస్ట్‌

ఇంటికి పిలిచి తడిమేసాడు.. నటుడి అరెస్ట్‌

మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..నటుడు అరెస్ట్

తమ కోరికలు తీర్చుకోవటానికి సినిమాని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూంటారు కొందరు. అమ్మాయిలను సినిమా ఆపర్స్ పేరుతో లోబర్చుకుని మోసం చేస్తూంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో మరీ కామన్ అయ్యిపోయాయి. తాజాగా మైనర్‌ బాలికను లైంగికంగా వేధించిన ఓ నటుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఫోటో షూట్‌ పేరుతో బాలికను ఇంటికి పిలిచి లైంగికంగా వేధించిన ఘటన పుణెలో చోటు చేసుకుంది. బాలిక ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు…35 ఏళ్ల మందార్‌ కులకర్ని మరాఠీలోని పలు టీవీ షోలలో నటిస్తుంటాడు. బాధిత బాలిక ఆరు నెలల క్రితం అతనిని పుణెలోని యాక్టింగ్‌ స్కూల్‌ కలిశానని తెలిపింది. ఈ పరిచయం కొద్ది మందార్‌ సదరు బాలికకు ఓ రోజు ఫోన్‌ చేసి ఓ టీవీ షోకి అడిషన్స్‌ జరుగుతున్నాయని.. బాధితురాలి ఫొటోలు కావాలని చెప్పాడు. అందు కోసం ఆమెను ఫొటో షూట్‌ చేయాలని.. తానే ఉచితంగా ఫోటో షూట్‌ చేస్తానని చెప్పి తన ఇంటికి రావాల్సిందిగా మందార్‌, బాలికను ఒప్పించాడు.

ఈ నేపథ్యంలో మందార్‌ వివిధ రకాల దుస్తులపై తన ఫొటోలు తీశాడని, ఆ తర్వాత బికినిపై కూడా ఫొటోలు కావాలని అడిగాడని బాలిక తెలిపింది. బికినిపై ఫొటోలు తీస్తున్న సమయంలో తన దుస్తుల కొలతలు తీసుకున్నాడని బాలిక ఆరోపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం గూర్చి తన తల్లిదండ్రులకు చెపింది.

దాంతో వెంటనే వారు బాలికను తీసుకుని సమీప పోలీస్‌ స్టేషన్‌లో నటుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ అంశంపై విచారణ జరపగా.. నిందితుడు తన సెల్‌ ఫోన్లో కూడా బాలిక ఫొటోలు చిత్రించినట్లు తెలింది. దీంతో పోలీసులు అతనిపై ఐపీసీ సెక‌్షన్‌ 354 , పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధినం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}