fbpx
Home Cinema 125 కోట్లకు 'సై రా' డిజిటల్ మరియు శాటిలైట్ రైట్లు

125 కోట్లకు ‘సై రా’ డిజిటల్ మరియు శాటిలైట్ రైట్లు

మెగాస్టార్ చిరు నటించిన ‘సై రా’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ ఏడాది విడుదల అవుతున్న మరో భారీ బడ్జెట్ సినిమా ఇదే. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు భారీ తారాగణంతో రూపొందింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అక్టోబర్ 22 న జరగనుంది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం వ్యాపారం పూర్తి చేసుకుంది. ఈ చిత్రం శాటిలైట్ మరియు డిజిటల్ రైట్లు మొత్తం కలిపి 125 కోట్లకు బిజినెస్ చేసింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ