fbpx
Home Cinema కమాండోగా, రైతుగా సూర్య 'బందోబస్త్'

కమాండోగా, రైతుగా సూర్య ‘బందోబస్త్’

వైవిధ్యమైన సినిమాలు కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. ఆయన తాజా సినిమా ‘బందోబస్త్’ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన దేశభక్తి గీతం ‘ఎన్నో తారల సంగమం… అంబరం ఒకటే…’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, ‘చెరుకు ముక్కలాంటి…’ పాట మాస్ ప్రేక్షకులను మెప్పించింది. కమాండోగా, రైతుగా సూర్య వేషధారణ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి.
పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అందువల్ల, విడుదలకు నెలన్నర ముందే శాటిలైట్ హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి.

సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}