fbpx
Home Cinema Box Office మ్యాటర్ చూపి... మీసం తిప్పాడు

మ్యాటర్ చూపి… మీసం తిప్పాడు

కేక :‘తిప్పరా మీసం’ప్రీ రిలీజ్ బిజినెస్!

ఇంతకాలం వేచి ఉన్నదానికి శ్రీవిష్ణుకు మంచి రోజులు వచ్చాయి. మీసం తిప్పి కాలరు ఎగురేయగలుగుతున్నాడు.ఆయన తాజా చిత్రానికి అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇంతకు ముందు రిలీజ్ కూడా చాలా కష్టంగా చేయగలిగే పరిస్దితుల్లో ఉన్న ఈ హీరో ఇన్నాళ్లకు ఒడ్డున పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. ‘శ్రీ ఓం సినిమా’ సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘తిప్పరా మీసం’. నవంబర్ 8న ఈ సినిమా విడుదల చేస్తున్నారు నిర్మాతలు. రిలీజ్ కు ముందు పూర్తి స్దాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి వారు ఫుల్ హ్యాపిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 7.50 కోట్ల బిజినెస్ డీల్ జరిగింది. ఆ డీల్ ని విడతీసి చూస్తే…థియోటర్ రైట్స్ నిమిత్తం ఏసియన్ ఫిల్మ్స్ వారు రెండున్నర కోట్లు చెల్లించారు. అలాగే కర్ణాటక, భారత్ లో మిగతా ప్రాంతాలు అన్ని కలిపి 75 లక్షలకు వేరే వారు తీసుకున్నారు.

ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ 1.75కోట్లు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి 2.50 కోట్లకు లాక్ అయ్యింది. ఈ స్దాయి బిజినెస్ శ్రీవిష్ణు కెరీర్ లో ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. అతి త్వరలోనే ట్రైలర్.. ఆడియో విడుదల వేడుక కూడా జరగనున్నాయి.

సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. తిప్పరామీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు ఈ మధ్యే మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (డైరెక్టర్), అజయ్ ఘోష్, రవి వర్మ తదితరులు ఇతర నటీనటులు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ