fbpx
Home Cinema శ్రీ విష్ణు ఇదెలా చేస్తాడో?

శ్రీ విష్ణు ఇదెలా చేస్తాడో?

భిన్నమైన కథ అంశాలను ఎంచుకునే హీరో శ్రీ విష్ణు. అతని తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’ అందుకు ఉదాహరణ. ఖచ్చితమైన ఫార్ములా చిత్రాలకు దూరంగా ఉంటాడు. ఇతను తాజాగా పోలీస్ అధికారిగా ఒక సినిమా చేయనున్నాడు. ఇతని కెరీర్లో పోలీస్ పాత్ర చేయడం ఇదే మొదటిసారి.

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తిబాబు నిర్మాతగా ప్రదీప్ వర్మ అనే దర్శకుడితో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను విజయదశమి సందర్బంగా దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక బృందాన్ని త్వరలో ఖరారు చేయనున్నారు.

శేఖర్ వీ జోసెఫ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. అన్నీ సినిమాలు భిన్నంగా ఎంచుకునే శ్రీ విష్ణు ఈ సారి పోలీస్ పాత్రను ఎలా పోషిస్తాడో వేచి చూద్దాం.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ