Home Cinema మరో రొమాంటిక్ డ్రామాలో శివాని రాజశేఖర్?

మరో రొమాంటిక్ డ్రామాలో శివాని రాజశేఖర్?

శివాని రాజశేఖర్, జీవిత-రాజశేఖర్ల పెద్ద అమ్మాయి. ఈమె నటించిన హిందీ రీమేక్ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉండగా, కొన్ని అవాంతరాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ హిందీ సినిమా 2 స్టేట్స్ కాగా తెలుగు వెర్షన్లో హీరోయిన్ శివాని, హీరో అడివి శేష్. అందువల్ల ఆమె తెరంగేట్రం ఆగిపోయింది.

ఇప్పుడు మరో అవకాశం ఆమె తలుపు తట్టింది. ‘కల్కి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రొమాంటిక్ డ్రామా స్క్రిప్ట్ రాసుకుని అందులో హీరోయిన్ గా శివానిని అనుకుంటున్నారట. ఇక హీరోగా ‘ఓహ్ బేబీ’ లో కనిపించిన ఒకనాటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ.

అయితే ఈ చిత్రానికి దర్శకుడు మాత్రం ప్రశాంత్ కాదు మల్లిక్ రామ్. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఈ సినిమాతో నైనా శివాని సినీ రంగ ప్రవేశం జరగొచ్చు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ