fbpx
Home Cinema మరోసారి తెలుగునే నమ్ముకున్న బాలీవుడ్ హీరో

మరోసారి తెలుగునే నమ్ముకున్న బాలీవుడ్ హీరో

ఏ భాషలో సినిమా హిట్ అయినా సరే మరో ప్రాంతీయ భాషలోకి దానిని రీమేక్ చేస్తుంటారు. ఇది దశాబ్దాలుగా ఈ ప్రక్రియ భాషా భేదాలు లేకుండా సాగుతూనే ఉంది. కాకపోతే ఒక్కోసారి ఒక్కో పరిశ్రమ తన సత్తా చాటుతుంది, దాంతో ఆ భాషలో హిట్ అయినా సినిమాలు పెద్ద మార్కెట్ కలిగిన పరిశ్రమలు కూడా పోటీలు పడి రీమేక్ చేస్తుంటాయి.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హిందీలో సైతం హిట్ కొట్టి కెరీర్ ని కాపాడుకున్న హీరో షాహిద్ కపూర్. అంత వరకు చేతిలో ఏ సినిమా లేదు కానీ ఒక్కసారిగా ఈ సినిమాతో మళ్ళీ స్టార్ అయ్యాడు. ఈ సినిమాతో విజయంతో మళ్ళీ మరో తెలుగు సూపర్ హిట్ చిత్రం రీమేక్ లో నటించనున్నాడు. అదే నాని ‘జెర్సీ’.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండగా గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ