fbpx
Home Cinema అఫీషియల్ :'ఆర్ ఎక్స్100' డైరెక్టర్ తో సెన్సేషనల్ స్టార్ హీరో…!

అఫీషియల్ :’ఆర్ ఎక్స్100′ డైరెక్టర్ తో సెన్సేషనల్ స్టార్ హీరో…!

అజయ్ భూపతికు సై అన్న ఆ సెన్సేషనల్ హీరో ఎవరో …

మొత్తానికి ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కొత్త సినిమాకు హీరో దొరికాడు. అతి త్వరలోనే ఈ సినిమా మొదలుకానుంది. భవ్య క్రియేషన్స్ ఆయనతో ఓ సినిమా చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్నీ కన్ఫర్మ్ వారు ఓ అధికారిక అనౌన్స్మెంట్ పోస్టర్ ని విడుదల చేశారు. అయితే అజయ్ భూపతి చిత్రంలో నటించనున్న హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్సే. ఎందుకంటే భవ్య క్రియేషన్స్ వారు ఓ సెన్సేషనల్ స్టార్ హీరో నటించబోతున్నారు అని హింట్ ఇచ్చారు కానీ, ఆ హీరో ఎవరో అనేది మాత్రం తేల్చి చెప్పలేదు.

గత కొంతకాలంగా అజయ్ భూపతి కు హీరో సెట్ కావటం లేదు.అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత సినిమాగా ఆయన ‘మహా సముద్రం’ టైటిల్ తో ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాను రవితేజతో రూపొందించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నాడు. దాంతో ఈ కథ చైతూ దగ్గరికి వచ్చినట్టుగా ప్రచారం జరిగింది.

ఆర్ ఎక్స్100 విడుదలై దాదాపు ఏడాది దాటిపోయాక ప్రాజెక్టు సెట్ అయ్యింది. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ