fbpx
Home Cinema Bollywood ఆ ఎగ్రిమెంట్ తో 'సైరా' కు సల్మాన్ ప్రమోషన్

ఆ ఎగ్రిమెంట్ తో ‘సైరా’ కు సల్మాన్ ప్రమోషన్

చెల్లుకు చెల్లు: మొన్న చెర్రీ చేస్తే..ఇప్పుడు సల్మాన్ చేసాడు

సినిమా ఇండస్ట్రీలో దేని లెక్కలు దానివే. ఎంత ప్రెడ్షిప్ అయినా నువ్వు చేస్తే..నేను చేస్తా అనే ధోరణిలో సాగుతుంటుంది. ఇప్పుడు అదే పద్దతి ఫాలో అయ్యి సల్మాన్ ఖాన్ …చిరంజీవి తాజా చిత్రం సైరాకు ప్రమోషన్ లో సాయిం చేస్తున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ తాజా చిత్ర్ం దబాంగ్ 3 తెలుగు వెర్షన్ ప్రమోషన్ కు రామ్ చరణ్ హెల్ప్ చేయటానికి ముందుకు వచ్చారు. ఆ మధ్యన ఫేస్ బుక్ లో దబాంగ్ 3 టీజర్ ని షేర్ చేసారు. ఇప్పుడు సల్మాన్ కూడా చిరంజీవి సైరా చిత్రం ట్రైలర్ హిందీ వెర్షన్ ని తన ట్విట్టర్ లో షేర్ చేసారు.

వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రం అక్టోబర్ 2న బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఒకేసారి అన్ని భాషల్లో ట్రైలర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ప్రశంసలు అందుకుంటోంది. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ పాత్ర ద్వారా మంచి క్రేజ్ నెలకొంది. ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా సైరాకి మరింత బూస్ట్ ఇచ్చాడు.

చాలా కాలంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సల్మాన్ ఖాన్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా తెలుగులో ప్రేమ లీలగా రిలీజయినప్పుడు చరణ్ సల్మాన్ వాయిస్ కి డబ్బింగ్ చెప్పాడు. రామ్ చరణ్ నిర్మించిన సైరా సినిమాకు సల్మాన్ తన బెస్ట్ విషెస్ ని అందించారు. అలాగే మెగాస్టార్ కి కూడా సినిమా మంచి విజయాన్ని అందించాలని సైరా హిందీ ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సైరా ట్రైలర్ బాలీవుడ్ లో మరింత హాట్ టాపిక్ గా మారింది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ