Home Cinema Box Office ఆ రెండు రాష్ట్రాలలో 'సాహో' దుమ్ము దులిపింది

ఆ రెండు రాష్ట్రాలలో ‘సాహో’ దుమ్ము దులిపింది

ఆ రెండు రాష్ట్రాల్లో సాహో రికార్డులు..!!

ప్రభాస్ హీరోగా రూపొందిన ‘సాహో’ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై ఎన్నో ఆశలు ఉన్నా.. రిలీజ్ తరువాత ఆ స్థాయిలో లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్స్ పరంగా ఎదురుదెబ్బ తగిలింది. కానీ, హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. అక్కడ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా హిందీ వెర్షన్ 150 కోట్లకి పైగా వసూళ్లను సాధించడం విశేషం.

మరీ ముఖ్యంగా బీహార్ లోను ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. బీహార్ రాష్ట్రంలో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో ‘సాహో’ 6వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. బీహార్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది సాహో. భజరంగి భాయ్ జాన్, పీకే, సింబా చిత్రాలకు మించి అక్కడ వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది సాహో. అలాగే ఒరిస్సా లోనూ ఈ సినిమా బాగా కలెక్ట్ చేసింది. ఒరిస్సా రాష్ట్రంలో బాహుబలి 2 తరువాత అంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా సాహో నిలిచింది

ప్రభాస్ తన తదుపరి చిత్రం జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో చేస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. జాన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ