fbpx
Home Cinema Bollywood ఇలియానాకు వేధింపులు...అతనంత దుర్మార్గుడా?

ఇలియానాకు వేధింపులు…అతనంత దుర్మార్గుడా?

ఇలియానా బ్రేకప్ వెనక అసలు కహాని

ఇప్పటికే ఇలియానా…ఆమె బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో రిలేషన్ మీద మీడియాలో కథనాలు బోలెడన్ని వచ్చేశాయి. అంతేకాదు.. తామిద్దరం కలిసి ఉన్న విషయాన్ని బయటపడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలేమీ తీసుకోకపోవటంతో ఆ విషయం ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ వచ్చింది. అయితే … చాలామంది ప్రముఖుల జీవితాల్లో మాదిరే.. ఇలియానా ప్రేమ కథలోనూ విషాదం తప్పలేదు. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయి విడిగా ఉంటోన్న ఇల్లీకి అసలు బ్రేకప్ ఎందుకు చేసుకుంది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

            బాలీవుడ్ మీడియా ప్రకారం.. ఇల్లీ బేబీ, ఆండ్రూ విడిపోవడానికి డబ్బే ప్రధాన కారణమని తెలుస్తోంది. కెరీర్ ఎత్తుపల్లాలో ఉండటం వల్ల సినిమా లైఫ్ ను పక్కన పెట్టి ఆండ్రూను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఇలియానా డిసైడ్ అయ్యిందిట! ఇక ఈ విషయమే ఆండ్రూకి నచ్చలేదంటున్నారు బీ టౌన్ జనాలు. సినిమాలు చేయమని ఆమె మీద ప్రెజర్ తెచ్చేవాడట. ఈ ఒత్తిడి తట్టుకోలేకే ఇలియానా చాలా సినిమాల్లో ఇష్టం లేకపోయినా నటించిందట. అయితే ఆమె అదృష్టమో..దురదృష్టమో కానీ ఆమె నటించిన తెలుగు, హిందీ సినిమాలు డిజాస్టర్స్ కావడంతో మరిన్ని ఆఫర్స్ తలుపు తట్టలేదు.

             దానితో ఇన్ని రోజులు ఇలియానా డబ్బులతో ఎంజాయ్ చేసిన ఆండ్రూ ఆమెను దూరం పెడుతూ.. వేధించడం మొదలుపెట్టాడని తెలుస్తోంది. ఇక ఇదే ఇద్దరి మధ్య బ్రేకప్‌కు దారి తీసింది. కాగా ప్రస్తుతం ఇలియానా గతాన్ని మర్చిపోయి మళ్ళీ తన కెరీర్‌పై దృష్టి పెట్టింది.

                  దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇలియానా.. ఆ తర్వాత ‘పోకిరి’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. … ఆ తర్వాత తన మకాం బాలీవుడ్‌కు మార్చింది. అయితే అక్కడ ఈ గోవా భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు, గుర్తింపు రాలేదు. అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటున్న ఇల్లీ బేబీ చివరి చిత్రం ‘రైడ్’ 2018లో విడుదలైంది. ఇక తన బాయ్‌ ఫ్రెండ్ బ్రేకప్ చేప్పాకా.. అవకాశాల కోసం దర్శక, నిర్మాతలు చుట్టూ తిరుగుతోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}