Home Cinema అక్టోబ‌ర్‌లో ర‌విబాబు 'ఆవిరి` విడుద‌ల‌

అక్టోబ‌ర్‌లో ర‌విబాబు ‘ఆవిరి` విడుద‌ల‌

విజయవంతమైన చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ఆవిరి.  ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ – కామెడీ, హార‌ర్ థ్రిల్ల‌ర్‌ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో ర‌విబాబు దిట్ట. ఈ రెండు జోన‌ర్స్‌లో ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ అయ్యాయి. అలాంటి ప్రతిభ గల దర్శకుడితో పని చేయడం ఆనందంగా ఉంది. ర‌విబాబు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న `ఆవిరి` ప్రేక్ష‌కులను మెప్పించే చిత్ర‌మ‌వుతుంది. అక్టోబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం అన్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ