Home Cinema Bollywood అమ్మమ్మ కాబోతున్న బాలయ్య హీరోయిన్

అమ్మమ్మ కాబోతున్న బాలయ్య హీరోయిన్

అమ్మమ్మ కాబోతోన్న రవీనా టాండన్!

గుర్తుందా…అప్పట్లో వచ్చిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో బాలయ్య సరసన చేసిన హారోయిన్ రవీనా టాండన్. ఆ సినిమాలో బాలయ్యతో ‘స్వాతిలో ముత్యమంత’ అంటూ స్టెప్పులేసి..ఆ కాలం కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు అమ్మమ్మ అవుతూ వార్తల్లో నిలిచింది. నలభై నాలుగేళ్లకే మనవరాలినో లేదంటే మనవడినో ఎత్తుకోబోతోంది. రవీనా టాండన్ కుమార్తె ఛాయ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.

ప్రస్తుతం రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న 44 ఏళ్ల రవీనా త్వరలోనే అమ్మమ్మ కాబోవటం సెన్సేషనే. అయితే అయితే 44 ఏళ్లకే అదీ ఓ హీరోయిన్ కు ఇదెలా సాధ్యం అంటే.. రవీనా టాండన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే అంటే ఇరై ఏళ్ల వయసులోనే ఛాయ, పూజ అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. ఇప్పుడు ఛాయ నిండు గర్భిణి. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.

న్యూట్రిషనిస్ట్ అయిన రవీనా మరో కుమార్తె పూజ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బేబీ షవర్ ఫొటోలను షేర్ చేసింది. రవీనా త్వరలో ‘నాని’ కాబోతున్నట్టు రాసింది. దత్తత తీసుకున్న కుమార్తె తల్లి కాబోతోందని తెలిసి నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తున్న రవీనాను చూసి తాను ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని పూజ పేర్కొంది. రవీనా 2004లో వ్యాపారవేత్త అనిల్ తడానీని పెళ్లి చేసుకుంది. వీరికి కుమార్తె రషా, కుమారుడు రణ్‌బీర్ వర్ధన్ సంతానం. రవీనా చివరిసారిగా ‘మాత్ర్’ అనే సినిమాలో నటించింది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ