fbpx
Home Cinema చెర్రీ చేసిన పని మెగా ఫ్యాన్స్ కు కంగారుపుట్టిస్తోంది

చెర్రీ చేసిన పని మెగా ఫ్యాన్స్ కు కంగారుపుట్టిస్తోంది

ముందు మన సినిమా సంగతి చూడు భయ్యా

మెగా ఫ్యాన్స్ కు కంగారుగా ఉంది. ఎందుకంటే సైరా చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతూంటే ఇంకా సరైన ప్రమోషన్స్ ప్రారంభం కాలేదు. రామ్ చరణ్ ఎలా ఈ సినిమా దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తాడో ఫ్యాన్స్ అంచనాలకు అందటం లేదు. తన సొంత సినిమా సైరా ని ప్రక్కన పెట్టి బాలీవుడ్ సినిమా ని ప్రమోట్ చేయటం చూసి ఆశ్చర్యపోతున్నారు.

అవును రామ్ చరణ్ తాజాగా సల్మాన్ ఖాన్ దబాంబ్ 3 చిత్రం టీజర్ ని తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ ద్వారా షేర్ చేసారు. దబాంగ్ 3 టైటిల్ తో తెలుగులో సల్మాన్ తాజా చిత్రం డబ్బింగ్ వెర్షన్ రాబోతోంది. సల్మాన్ కు, రామ్ చరణ్ కు ఉన్న స్నేహంతో ఈ చిత్రం ప్రమోషన్ చేస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్ త్వరలో ఈ సినిమాలో సల్మాన్ వాయిస్ కు డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం. గతంలో ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా కు కూడా సల్మాన్ వాయిస్ కు తెలుగులో రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారు.

అయితే ఎప్పుడో డిసెంబర్ 20న రిలీజ్ అయ్యే దబాంగ్ 3 సినిమాకు రామ్ చరణ్ ప్రమోషన్ చేస్తున్నారు కానీ సైరా కూ చేయటం లేదనేదే అభిమానుల ఆవేదన. ఇదే విషయాన్ని రామ్ చరణ్ ని అడుగుతున్నారు. ఇప్పటిదాకా ఈ సైరా కుసంభందించి కొత్త టీజర్స్ కానీ పాటలు కానీ రిలీజ్ చేయలేదు. మరో 20 రోజులు మాత్రమే రిలీజ్ ఉన్నా ఇంకా ప్రమోషన్స్ ప్రారంభించకపోవటం విచిత్రమే.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}