fbpx
Home Cinema రాజ్ తరుణ్ మరోసారి తప్పు చేస్తున్నాడా?

రాజ్ తరుణ్ మరోసారి తప్పు చేస్తున్నాడా?

అది వరకు వచ్చిన క్రేజ్ ను తన తప్పుడు నిర్ణయాలతో కోల్పోయాడు హీరో రాజ్ తరుణ్. ప్రస్తుతం మళ్ళీ తన పూర్వ వైభవం కోసం కష్టపడుతున్నాడు. సినిమా చూపిస్త మావ చిత్రం యావరేజ్ హిట్ గా నిలిచినా తరువాత అతనికి అన్నీ ప్లాపులే. ప్రస్తుతం మేల్కొని మళ్ళీ సినిమాలు వరుసగా సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో దిల్ రాజు బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

అలాంటిది ఇప్పుడు తానూ 2016 లో చేసిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి తో మరో సినిమాకి సంతకం చేసాడు. ఆ సినిమా అతని కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. మరి మళ్ళీ అలాంటి దర్శకుడితో సినిమా అంటే కొంచెం సాహసమనే చెప్పాలి. చూద్దాం మరి ఎం జరుగుతుందో.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ