fbpx
Home Cinema తమిళ తంబీలు..ప్రభాస్ ని వదలలేదు

తమిళ తంబీలు..ప్రభాస్ ని వదలలేదు

తమిళనాట ప్రభాస్ కు పెద్ద హోర్డింగ్ లు

ఇప్పుడు ఎక్కడ విన్నా, ఏ మీడియాలో చూసినా ప్రభాస్ నామస్మరణే. పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కు సౌత్ రాష్ట్రాల్లో అయితే ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యింది. సాహో రిలీజ్ కోసం నార్త్, సౌత్ అనే తేడాలేకుండా భారత్ లోని సినిమా అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అయితే తమిళనాట అది మరీ ఎక్కువగా ఉంది. సాధారణంగా స్టార్స్ సినిమా రిలీజ్ లు అప్పుడు హంగామా ఓ రేంజిలో చేయటంలో తమిళ తంబీలకు దేశవ్యాప్తంగా పేరు. సాహో విషయంలోనూ అది మరోసారి రుజువైంది.

తమిళనాడులోని అన్ని మేజర్ థియోటర్స్ లోనూ ప్రభాస్ పెద్ద కటౌట్ లు కనపడుతున్నాయి. ఇన్నాళ్లూ తమ తమిళ స్టార్స్ కే పాలాభిషేకాలు, కటౌట్స్ అని పరిమితమైన తంబీలు ఇప్పుడు ప్రభాస్ కు ఫ్యాన్స్ ఏర్పడి రచ్చ రచ్చ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో తమిళంలోనూ ప్రభాస్ కు ఓ స్దాయిలో ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

అందుకే తమిళనాట కూడా సాహో చిత్రాన్ని 600 థియోటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి 2 కన్నా ఎక్కువ థియోటర్స్ ఇవి. ఏ నాన్ తమిళ స్టార్ కు కూడా ఈ స్దాయిలో రిలీజ్ తమిళనాట లేదు. అలాగే అక్కడ సాహో బిజినెస్ కూడా బాగా జరిగింది. ప్రభాస్ ఈ విషయాలు గమనించే చెన్నై వెళ్లి మరీ ప్రమోట్ చేసారు. అక్కడ లోకల్ మీడియాతోనూ మాట్లాడారు. ఇంటర్వూలు ఇచ్చారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ