fbpx
Home Cinema Box Office 'సాహో' ఫస్ట్ డే కలక్షన్

‘సాహో’ ఫస్ట్ డే కలక్షన్

‘సాహో’ తొలిరోజు ఎంత వచ్చే అవకాసం ఉందంటే

దేశం మొత్తాన్ని ఏకం చేసి క్రేజ్ తెచ్చుకున్న ఏకైక సినిమా ‘బాహుబలి’ మాత్రమే. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘2.0’ కొద్దిగా అటూ ఇటూగా హైప్ మధ్య రిలీజైంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా భారీగా రిలీజవుతూ.. అందరిలోనూ ఆసక్తి రేపిన సినిమా అంటే ‘సాహో’నే. అందుకే ఈ సినిమాపై అందరి కళ్లూ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అని ఎదురు చూస్తున్నారు. మొదట రోజు ‘సాహో’ ఎంత వసూలు చేసిందన్న దాన్ని బట్టి ప్రభాస్ స్టామినా అంచనా వేసే అవకాసం ఉంటుంది.

అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమా మార్నింగ్ షో నుంచే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. సినిమాకు వచ్చిన హైప్ మొత్తం పోయేలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యిపోయింది. దాంతో టాక్ ప్రభావం ఖచ్చితంగా కలెక్షన్స్ పై పడుతుందని లెక్కలేస్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ తొలిరోజు కలెక్షన్స్ పై పడదు.

దానికి తోడు రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ల రేట్లు పెంచారు. ఏపీలో అదనపు షోలు కూడా పడ్డాయి. దాదాపుగా వీకెండ్ అంతా హౌస్ ఫుల్స్ వాతావరణం కనిపిస్తోంది. దాంతో తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.35-40 కోట్ల మధ్య షేర్ వస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. గ్రాస్ రూ.50 కోట్లను దాటే అవకాశముంది.

ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి దాదాపు 60-70కోట్లు కలెక్ట్‌ చేయవచ్చని తెలుస్తోంది. తెలుగులో 35, హిందీలో 15-20, తమిళంలో 15కోట్లు మలయాళంలో 5కోట్ల వరకు వసూళ్లను సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}