fbpx
Home Cinema టాలీవుడ్ పైనే కన్నేసిన పాయల్!

టాలీవుడ్ పైనే కన్నేసిన పాయల్!

బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ చేసిన తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్‌. ఆ సినిమా గురించి ప్రచారంలో మాట్లాడుతూ – “ఆర్‌ఎక్స్ 100తో మంచి గుర్తింపు వచ్చింది. ఏడాది తరువాత ఈ సినిమాతో మళ్లీ వస్తున్నా. పాత్రపరంగా కాస్త బోల్డ్‌నెస్ ఉన్నా మహిళా ప్రాధాన్యమున్న కథ కావడంతో సినిమాకు ఓకే చెప్పా. సామాజిక కార్యకర్తగా ఊరి సమస్యలపై పోరాడే అలివేలు పాత్రలో కనిపిస్తా”.

“పాపికొండలు గ్రామంలో సాగే కథలో నా పాత్ర అత్యంత సహజంగా ఉంటుంది. సినిమామీద ఆసక్తి పెంచేందుకు కిస్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలను టీజర్, ట్రైలర్స్‌లో చూపించారే తప్ప.. సినిమా కంటెంట్ వేరు. ఈ సినిమా కోసం ఏమాత్రం సౌకర్యాల్లేని గ్రామంలో రోజులు తరబడి కష్టపడ్డాం. నా కెరీర్‌లో ఇదో మంచి సినిమా అవుతుందన్న నమ్మకముంది. ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించి చెప్పాలంటే -వెంకీమామ, డిస్కోరాజా చేస్తున్నా. మరో ప్రాజెక్టులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నా. పంజాబీలోనూ మంచి అవకాశాలు వస్తున్నా, ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే ఉంది” అని చెప్పుకొచ్చింది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ