Home News Andhra Pradesh పవన్ కూడా ఆ పోరాటంలో పాల్గొనబోతున్నారా?

పవన్ కూడా ఆ పోరాటంలో పాల్గొనబోతున్నారా?

గంగా ప్రక్షాళన పోరాట యాత్రలో పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళన కోసం అసువులు బాసిన ప్రొ. జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెన్నునొప్పి బాధ ఇంకా తగ్గనప్పటికీ మాత్రి సదన్‌కు వెళ్లి అగర్వాల్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశంలోని నదులను కాపాడుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.

పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. పవిత్ర గంగా నదిని కాలుష్యానికి గురిచేయడమంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. గంగా ప్రక్షాళన పోరాటం దీనికి నాంది కావాలని పిలుపునిచ్చారు. తాను పోరాటయాత్రలో ఉండగా జీడీ అగర్వాల్‌ మరణవార్త తెలిసిందని, ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలిచివేసిందని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆ రోజునే తాను హరిద్వార్‌కు వచ్చి అగర్వాల్‌ పార్ధీవదేహానికి నివాళులు అర్పిద్దామనుకున్నానని, అయితే పోరాట యాత్ర వల్ల రాలేకపోయానని తెలిపారు.


ఇక రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన రాజేంద్రసింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా అగర్వాల్‌ వర్థంతి కార్యక్రమానికి హాజరుకావాలని పవన్‌ కల్యాణ్‌ను కోరారు. దీంతో పవన్‌ కల్యాణ్‌ హరిద్వార్‌ వెళ్లారు.

గురువారం సాయంత్రం డెహ్రడూన్‌కు చేరుకున్న జనసేనాధిపతి అక్కడి నుంచి హరిద్వార్‌ దగ్గరలోని మాత్రి సదన్‌ ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ గురూజీ స్వామి శివానంద మహరాజ్‌, రాజేంద్రసింగ్‌లు పవన్‌ కల్యాణ్‌ను సాదరంగా ఆహ్వానించారు. గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు ఆశ్రమ గురూజీ శివానంద మహారాజ్‌ వివరించారు.

పవన్‌ కల్యాణ్‌ గురించి, ఆయన పోరాట స్ఫూర్తి గురించి తాను తెలుసుకున్నానని, గంగా ప్రక్షాళన పోరాట యాత్రకు ఆయన బాసట కావాలని కోరినట్లు శివానంద మహారాజ్‌ తెలిపారు. దక్షిణాది నుంచి గంగా పక్షాళన పోరాటానికి తగినంత మద్దతు లభించడం లేదని, పవన్‌ కల్యాణ్‌ దానిని భర్తీ చేయాలని ఆయన కోరారు.

వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. జీడీ అగర్వాల్‌లో ఉన్న పోరాట స్ఫూర్తిని తాను పవన్‌ కల్యాణ్‌లో చూశానని పేర్కొన్నారు. గంగా ప్రక్షాళన కోసం పవన్‌ కల్యాణ్‌ కూడా గట్టి కృషి చేయాలని ఆయన కోరారు.

మొదట పవన్‌ కల్యాణ్‌ గంగా ప్రక్షాళన కోసం 115 రోజులు నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన స్వామి నిగమానంద సరస్వతి సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం గంగా నది వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాత్రి సదన్‌ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకొని జీడీ అగర్వాల్‌ గంగా ప్రక్షాళన పోరాటం జరిపారు.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

ప్రేమ గువ్వ‌లు విడిపోలేదు.. డిసెంబ‌ర్ లో పెళ్లి బాజా!!

ర‌ణ‌బీర్ క‌పూర్-ఆలియా భ‌ట్ జంట‌ ప్రేమ‌...పెళ్లి వ్య‌వ‌హారంపై నిత్యం క‌థ‌నాలు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట బ్రేక‌ప్ అయింద‌ని కొంద‌రంటే... ఇప్ప‌టికే సీక్రెట్ పెళ్లి అయిపోయింద‌ని మ‌రికొంద‌రు.. ఇంకొంత మంది పెళ్లికి...

దాడి చేసిన వాళ్ల‌పై గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ వీరంగం!

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో టెన్ష‌న్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇక ఇలాంటి ప్ర‌మాద‌క‌ర స‌న్నివేశంలో డాక్ట‌ర్లు.. మెడికోలు.. ఆశా వ‌ర్క‌ర్లు.. ఎన్జీవోలు త‌మ ప్రాణాల‌కు తెగించి కొవిడ్-19 వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స అందిస్తున్న...

క‌ష్టాల్లో నేచుర‌ల్ స్టార్ నాని!

టాలీవుడ్‌లో వున్న మినిమ‌మ్ గ్యారెంటీ హీరో నేచుర‌ల్ స్టార్ నాని. ఈ హీరో ప్ర‌స్తుతం క‌ష్టాల్లో వున్నాడు. ఇటీవ‌ల `జెర్సీ` చిత్రంతో హిట్‌ని సొంతం చేసుకున్నా ఆ త‌రువాత వ‌చ్చిన `గ్యాంగ్ లీడ‌ర్‌`...

చిరంజీవి చిత్రానికి మ‌రో షాక్‌!

కొన్ని సినిమాలు ఎప్పుడు ప్రారంభించారో ఎప్పుడు పూర్తి చేశారో ఎవ‌రికీ తెలియ‌దు. అంత సైలేంట్‌గా పూర్తియిపోతుంటాయి. కానీ కొన్ని మాత్రం నిత్యం ఏదో ఒక వివాదంతో ప్రారంభం నుంచి వార్త‌ల్లో నిలుస్తుంటాయి. ప్ర‌స్తుతం...

సీసీసీ నిధికి చేరిన 6 కోట్లు కార్మికుల అకౌంట్లోకి!

మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా ఏర్పాటు చేసిన సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ)కి ఇప్ప‌టి వ‌ర‌కు 6 కోట్ల‌కు మించి విరాళాలు అందాయి. చిరు, నాగ్‌, ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ద‌గ్గుబాటి ఫ్యామిలీ.....

రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా?

ద‌ర్శ‌క‌ధీర అంటూ జేజేలందుకుంటున్న రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. జ‌క్క‌న్న తీస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని తెలిసింది. `స్టూడెంట్ నెం.1`...

క‌రోనా సినిమాలు చూడొచ్చు క‌దా శేష్‌?

టైమ్ చూసి టైమ్ బాంబ్ లా ఏదో ఒక కొత్త‌ద‌నం ఉన్న సినిమాతో అభిమానుల ముందుకు రావ‌డం గూఢ‌చారి హీరో శేష్ ప్ర‌త్యేక‌త‌. ఇంత‌కుముందు గూఢ‌చారి అలాంటి సినిమానే. ఉన్న‌ట్టుండి ప‌రిమిత బ‌డ్జెట్...

ఇంట్లో క్వారంటైన్ అని చెప్పి కుర్ర‌హీరోతో బెడ్ రూమ్‌లో

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని లాక్ డౌన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అగ్ర రాజ్యం పేద రాజ్యం అనే తేడా లేకుండా అన్నిటినీ చుట్ట‌బెట్టేసింది. ఈ స‌మ‌యంలో సెల‌బ్రిటీ ప్ర‌పంచం.. సామాన్య ప్ర‌జ‌లు అనే...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

వైట్ల వ‌ర్సెస్ కోన‌: క‌త్తుల‌తో పొడుచుకునేంత లేదు కానీ!

దర్శ‌కుడు శ్రీనువైట్ల‌-రైట‌ర్ కొన వెంక‌ట్ జోడీ సూప‌ర్ స‌క్సెస్ ల గురించి తెలిసిందే. ఈ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఢీ`..`రెడీ`.. `దూకుడు`..`బాద్ షా` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాయి. ఈ విజ‌యాల‌తోనే శ్రీ‌ను...