fbpx
Home Cinema ‘పావలా కల్యాణ్’అన్న హీరోయిన్ కు ఫ్యాన్స్ చుక్కలు

‘పావలా కల్యాణ్’అన్న హీరోయిన్ కు ఫ్యాన్స్ చుక్కలు

చూసుకుని ట్వీట్ చేయాలమ్మా..లేకుంటే ఇలాగే ఉంటుంది

తమ హీరోని ఏదన్నా అంటే ఫ్యాన్స్ తట్టుకోగలరా…మరీ ముఖ్యంగా పవన్ ని దేవుడుగా భావించే పవన్ అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. పొరపాటున అన్నా వాళ్లకు పగిలిపోవాల్సిందే. అదే జరిగింది ఆ విషయంలో…

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం 48వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మిలియన్ల కొద్దీ ట్వీట్స్ తో విషెస్ చెప్పడంతో పవన్ పేరు ఇండియాలో టాప్ 1 ట్రెండింగ్ గా నిలిచింది. అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం పవన్ పేరుతో వరుసగా ట్వీట్లు చేశారు.

ముఖ్యంగా పవన్‌తో పనిచేసిన హీరోయిన్లు కూడా ఆయనకు తమ అభినందనలు తెలియచేసారు. వారిలో నికీషా పటేల్ ఒకరు. పవన్ కల్యాణ్ సరసన కొమరం పులి చిత్రంలో నటించిన ఈ సుందరి ఆయనకు పుట్టినరోజు విషెస్‌ చెప్పింది.

ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లను ఆమె పెట్టింది. అందులో ‘హ్యాపీ బర్త్‌డే పావలా కల్యాణ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా చూసుకోకుండా పెట్టింది. అది కావాలని చేయనప్పటకీ.. పవన్ ఫ్యాన్స్‌ మాత్రం బాగా కాలింది. దాంతో ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మా దేవుడు పవన్ పుట్టినరోజు నాడు ఇలాంటి హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసాతావా అంటూ సోషల్ మీడియాలో ఆమెకు కౌంటర్ ఇస్తూ చుక్కలు చూపించారు.

కాస్సేపటికి తప్పు గ్రహించిన నికీషా వెంటనే ఆ ట్వీట్ ని తొలగించి పవన్ అభిమానులకు క్షమాపణలు చెప్పి కొత్తగా మరో ట్వీట్ చేసింది. ‘‘ఈ సారి నేను కరెక్ట్‌గానే ట్యాగ్ చేశానని భావిస్తున్నా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా కష్టంగా తయారవుతోంది. మీరందరూ దీన్ని ఎలా కొనసాగిస్తారో తెలియదు. ఎవరైనా హర్ట్ అయితే క్షమించండి. తప్పును సరిదిద్దుకున్నా’’ అంటూ నికీషా కామెంట్ పెట్టింది. కానీ అప్పటికే జరగాల్సినంత రచ్చ జరిగిపోయింది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}