fbpx
Home Cinema అఖిల్ కు తప్పని హీరోయిన్ కష్టాలు

అఖిల్ కు తప్పని హీరోయిన్ కష్టాలు

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదు అన్నది ఒక సామెత. అలా ఉంది అక్కినేని అఖిల్ పరిస్థితి. ఓ వైపు ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టడం కేవలం మూడు సినిమాల అనుభవం. దాంతో తనకు ఎలాంటి సినిమా సరిపోతుందో తెలియదు. ఎదో తంటాలు పడి ప్రయత్నం చేస్తున్నా తన పక్కన చమక్కుమనే హీరోయిన్ లేకపోవడం అఖిల్ కు పెద్ద లోటు.

ప్రస్తుతం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే అని ప్రకటించేశారు కూడా. కానీ చివరికి ఆమె డేట్లు కూడా లేక కుదరదు అందట, దాంతో మళ్ళీ కొత్త అమ్మాయి కేతిక శర్మ ను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు మాదిరి కుటుంబ అనుబంధాల నడుమ ఒక అందమైన ప్రేమ కథ అని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}