fbpx
Home Cinema రానా సినిమాలో నయన్?

రానా సినిమాలో నయన్?

నయనతార తెలుగులో సినిమాలు చేయడం తగ్గించినట్టుగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘సై రా’ వంటి పెద్ద సినిమా తరువాత నయన తార చేసే తదుపరి తెలుగు చిత్రం ఏంటా అని ఆరా తీస్తే – హీరో రానా సొంత నిర్మాణ సంస్థలో ఒక ద్విభాషా చిత్రానికి నయనతార అంగీకరించింది. వివరాల్లోకి వెళ్తే…

ఆ మధ్య ఒక కొరియన్ యాక్షన్ సినిమా రీమేక్ రైట్లను రానా కొన్నాడు. ఆ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయాలి అనుకుంటుండగా హీరోయిన్ కీర్తి ని సంప్రదిస్తే ఆమె కాదంది. దాంతో ఈ ప్రాజెక్ట్ నయన్ కు వెళ్ళింది ఆమె స్క్రిప్ట్ విని సరే అన్నట్టు సమాచారం.

నయన్ ఇది వరకే కలెక్టర్, సిబీఐ అధికారి పాత్రలు పోషించింది. ఇప్పుడు పోలీస్ అధికారిణి పాత్ర ఆమెకు మొదటి సారి అవుతుంది. అంతే కాదు ఈ ప్రాజెక్ట్ భాగస్వామ్యం కూడా నయన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ