Home Cinema మరోసారి శివ నిర్వాణతో నాని సినిమా

మరోసారి శివ నిర్వాణతో నాని సినిమా

ప్రస్తుతం గ్యాంగ్‌లీడర్ చిత్రం ప్రమోషన్స్‌తో తీరిక లేకుండా ఉన్న నాని 25 వ సినిమా
‘వి’ని సైతం త్వరత్వరగా పూర్తి చేస్తున్నాడు. తరువాతి చిత్రాల పైనా దృష్టి పెట్టాడు. ‘వి’ తరువాత ఏ దర్శకుడితో నాని పని చేస్తాడా అని అందరూ అనుకుంటుండగా ఆ ఊహా గానాలకు తెర దించుతూ ఆ మధ్య ‘నిన్ను కోరీ’ అంటూ నానికి హిట్ ఇచ్చిన శివ నిర్వాణతో సినిమా చేయనున్నట్టు సమాచారం.

వీరి కలయికలో ఈ కొత్త చిత్రం వచ్చే ఏడాది మొదలవుతుంది. ఈ చిత్రానికి సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలు. కుటుంబ కథా చిత్రాలను అందులోని భావోద్వేగాలను అందంగా చూపించగల శివ ఈ మధ్య సమంతతో ‘మజిలీ’ చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నాని కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తాడో అని చర్చించుకోవడం మన వంతైంది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ