fbpx
Home Cinema మరో సారి 'నిన్ను కోరి' దర్శకుడితో నాని

మరో సారి ‘నిన్ను కోరి’ దర్శకుడితో నాని

హీరో నాని తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ చిత్రం మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు తెచ్చుకుంది. ఈ చిత్రం మొదటి రోజుకే 5 కోట్లు వసూలు చేసిందని సమాచారం. దానికి తోడు ఈ చిత్రం పై మంచి టాక్ వచ్చేసరికి సినిమా ముందు ముందు మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉంది. దాంతో నాని ప్రేక్షకులకు కృతజ్ఞతలు కూడా చెప్పారు.

ఇక నాని తదుపరి సినిమాల విషయానికి వస్తే నాని 25 వ చిత్రం ‘వి’ షూటింగ్ బ్యాంకాక్ లో వచ్చే వారం నుండి మొదలు కానుంది. ఆ పైన నాని 26 వ చిత్రం ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ తో ఉండబోతోంది.

ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని మజిలీ నిర్మాతలు సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ