Home Cinema కొత్త దర్శకుడితో నాగ్ సినిమా

కొత్త దర్శకుడితో నాగ్ సినిమా

నాగార్జునకి తాజాగా కాలం కలిసి రావట్లేదు. వరుస ప్లాప్లే కాకుండా ‘మన్మధుడు 2 ‘ ఆయన కెరీర్ ను మరింత దిగజార్చింది. దాంతో తిరిగి తీవ్రంగా కృషి చేస్తేనే కానీ విజయం వరించేలా లేదు నాగార్జునను. ‘మన్మధుడు 2 ‘ తో ప్రేక్షకులు ఆయన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకోవట్లేదో అర్ధం అయింది నాగార్జునకు.

ఎప్పుడూ కొత్త ప్రతిభను ప్రోత్సహించే నాగార్జున తాజాగా ఒక కొత్త దర్శకుడు సల్మాన్ చెప్పిన కధ నచ్చి సరే అన్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో మొదలు కానుంది. మాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ చిత్రం వివరాలు త్వరలో తెలియనున్నాయి. దర్శకుడు సల్మాన్ కొరటాల శివ మరియు వంశీ పైడిపల్లి దగ్గర శిష్యరికం చేసాడు. ఈ సారి ఎలాంటి సినిమాను నాగ్ ఎంచుకున్నాడో చూడాలి మరి

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ