Home Cinema నాగశౌర్య సడెన్ గా ఈ ఛేంజ్ ఏంటి?

నాగశౌర్య సడెన్ గా ఈ ఛేంజ్ ఏంటి?

కొత్త లేడీ డైరెక్ట‌ర్ తో నాగ‌శౌర్య‌, ఇంకో నాలుగు కూడా

హీరో నాగశౌర్య కి ఛ‌లో స‌క్సెస్ త‌ర్వాత ఒక్క సినిమా హిట్ కాలేదు. ఓ బేబి వర్కవుట్ అయినా క్రెడిట్ అంతా స‌మంత ఖాతాలోకి వెళ్లి పోయింది. దాంతో ఇప్పుడు తన స్పీడు పెంచాడు. వరసగా ఐదు సినిమాలు ఓకే చేసాడు. అందులో ఓ లేడీ డైరక్టర్ సినిమా కూడా ఉంది. ల‌క్ష్మీ సౌజ‌న్య అనే ఓ లేడీ డైరెక్ట‌ర్ చెప్పిన కథకి ఫిదా అయ్యి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు.

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైనింగ్ లో కొత్త ఫార్మెట్ లో సాగే క‌థ అని చెప్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ దర్శకురాలు.. గతంలో నాగచైతన్యతో సినిమా చేసింది. ఇప్పుడు కూడా అదే కథ, ఆమే డైరక్టర్. కాకపోతే హీరో నే మారాడు.

ప్రస్తుతం రమణతేజ దర్శకత్వంలో సొంత బ్యానర్ పై అశ్వద్ధామ అనే సినిమా చేస్తున్నాడు శౌర్య. ఈ మూవీతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి అనే టైటిల్ తో మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఇక సుబ్రమణ్యపురం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో పార్థు అనే సినిమాకు చాలా కాలం కిందటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ