fbpx
Home Cinema నాగ్ తో చైతు నటించట్లేదు

నాగ్ తో చైతు నటించట్లేదు

హీరో నాగ చైతన్యకు ‘మజిలీ’ సినిమా విజయం తరువాత ఏ సినిమా ఎంచుకోవాలి ఎలాంటి దర్శకుడితో పని చేయాలి అనే విషయం పై పూర్తి స్పష్టత వచ్చేసినట్లుంది. ఆచి తూచి దర్శకులను, కధలను ఎంచుకుంటున్నాడు. అతను ప్రస్తుతం ‘వెంకీ మామ’ మరియు శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నాడు.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అది వరకు నాగార్జున తో చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం విజయవంతం అయింది. దాంతో మళ్ళీ కళ్యాణ్ ‘బంగార్రాజు’ అనే కధ రాసుకున్నాడు. ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ కలిసి నటించనున్నారు అని వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం మేరకు కళ్యాణ్ చెప్పిన కధ చైతు కి నచ్చలేదట. సినిమాలో నటించనని తెగేసి చెప్పేసాడు. దాంతో నాగార్జున మాత్రమే ఈ సినిమాను ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ