fbpx
Home Cinema 'సాహో' పై ఫ్రెంచ్ డైరక్టర్ సిగ్గుపడేలా సెటైర్

‘సాహో’ పై ఫ్రెంచ్ డైరక్టర్ సిగ్గుపడేలా సెటైర్

కాపీ సరిగ్గా కొట్టలేదంటూ ‘సాహో’ ని…

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’ ఆగస్టు 30న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా డివైడ్ టాక్ అందుకుంది. కానీ వీకెండ్ లలో బాక్సాఫీసు వద్ద మాత్రం బాగానే వసూళ్లు రాబడుతోంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.205 కోట్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పాపలర్ ప్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్‌’ ఆధారంగా రూపొందినట్లు అందరూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో ‘సాహో’ చిత్రంపై ‘లార్గో వించ్‌’ డైరక్టర్ జెరోం సల్లే మండిపడ్డారు. తన చిత్రం ‘లార్గో వించ్’ను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారని ట్వీట్‌ చేశారు. రెండోసారి ‘లార్గో వించ్‌’ను ‘ఫ్రీమేక్‌’ చేశారని తప్పుపట్టారు. ‘సాహో’ తనకు నచ్చలేదని తెలిపారు. తన సినిమాను కాపీ చేసారని , కానీ దాన్ని సక్రమంగా తెరకెక్కించలేదని.. కాస్త చూసుకుని కాపీలు చేయాలని సలహా ఇచ్చారు. ఈ విషయంపై ఇంకా చిత్ర యూనిట్ స్పందించలేదు.

గతంలోనూ పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘అజ్ఞాతవాసి’పై ఆయన ఇదే విధంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా ‘లార్గో వించ్‌’ ప్రేరణతో తీశారని ఆయన అన్నారు. అప్పట్లో అది హాట్‌టాపిక్‌ అయ్యింది. కాగా ఇప్పుడు జెరోం ‘సాహో’ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ