fbpx
Home Cinema కళ్యాణ్ రామ్ తాజా చిత్రం రీమేక్ కథ?

కళ్యాణ్ రామ్ తాజా చిత్రం రీమేక్ కథ?

118 తో సైలెంట్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం ‘ఎంత మంచివాడవురా..’ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. శ్రీనివాస కల్యాణం, శతమానం భవతిలాంటి మోడ్రన్ క్లాసిక్స్ తెరకెక్కించిన సతీష్ వేగేశ్న దర్శకుడు.

అయితే, ఇదో రీమేక్ కథ అన్న వార్తలు చిత్రపరిశ్రమలో వినిపిస్తున్నాయి. గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ రీమేక్ రైట్స్ తీసుకుని, నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు కథను అల్లుకున్నట్టు చెప్పుకుంటున్నారు. కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పీర్జాదా కనిపించనుంది. ఇది రీమేక్ కథనటగా అని యూనిట్ ని అడిగితే తెలియదు అంటూ తప్పించుకుంటున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ