fbpx
Home Cinema గోపిచంద్ కు హీరోయిన్ గా తమన్నా

గోపిచంద్ కు హీరోయిన్ గా తమన్నా

మిల్క్ బ్యూటీ తమన్నా జోరు తెలుగులో కొంచెం తగ్గిందనే చెప్పాలి. బాహుబలి తరువాత కూడా ఆమెకు హిట్లు ఏమీ లేవు. దాంతో ఇప్పుడు ఏ హీరోతో అవకాశం వచ్చిన వదులుకోవట్లేదు. తాజాగా గోపీచంద్ హీరోగా ఆయన 28 వ చిత్రం సంపత్ నంది తో ప్రారంభం అయింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంతో మందిని సంప్రదించినా చివరికి తమన్నా ఒప్పుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు సంపత్ నంది అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ ‘చాణక్య’ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా అక్టోబర్ 5 న విడుదల కానుంది. ఈ సినిమా పై హీరో గోపీచంద్ తన ఆశలన్నీ పెట్టుకున్నారు. చూద్దాం మరి ఈ థ్రిల్లర్ చిత్రం ఏ మేరకు ఆయన అంచనాలను నిజం చేస్తుందో.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ