fbpx
Home Cinema అధర్వ మురళి 'డ‌స్ట‌ర్‌1212' ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్

అధర్వ మురళి ‘డ‌స్ట‌ర్‌1212’ ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్

వాల్మీకి ఫేమ్ అధర్వ హీరోగా నటించిన చిత్రం డస్టర్ 1212 . శుభ‌కరి క్రియేష‌న్స్ ప‌తాకం పై బ‌ద్రీ వెంక‌టేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి మ‌రిపి విద్యాసాగ‌ర్ నిర్మాత. అనైకాసోటి మిస్తీ అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను హీరో శ్రీ‌కాంత్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ ‘డస్ట‌ర్ 1212 టీమ్‌కి నా ప్ర‌త్యేక అభినంద‌న‌లు.

అథ‌ర్వా హీరోగా న‌టిస్తున్నారు. చాలా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. అధ‌ర్వ ముర‌ళీగార‌బ్బాయి. ముర‌ళీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు గ‌తంలో ‘హృదయం’ చిత్రంతో అంద‌రికీ ప‌రిచ‌య‌మున్న‌వ్య‌క్తి. వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో విడుద‌ల‌వ‌బోతుంది. ప్రొడ్యూస‌ర్ విన‌య్‌గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధించాలని చిత్రానికి అభినందనలు తెలియ చేశారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ