fbpx
Home Cinema తమిళ రీమేక్ తో రవి తేజ కొత్త సినిమా

తమిళ రీమేక్ తో రవి తేజ కొత్త సినిమా

మాస్ మహారాజ రవి తేజ కెరీర్ కొంచెం గాడి తప్పడం మనకు తెలిసిందే. అయితే మళ్ళీ తన సత్త చాటుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ అంటూ మన ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా తరువాత రవి తేజ తరువాత సినిమా ఏంటంటే ఒక తమిళ రీమేక్ సినిమా.

ఈ మధ్య తమిళంలో హిట్ అయినా సినిమాలను తెలుగులో రీమేక్ చేసి విజయాలు అందుకుంటున్నారు. అందులోనూ ప్రస్తుతం ప్లాప్లలో ఉన్న రవికి ఇవి పనికి రావచ్చు. అలా అతను ఎంచుకున్న సినిమా ‘విక్రంవేద’. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది.

ఈ సినిమాను తెలుగులో చేసేటప్పుడు మాధవన్ పోషించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రను రవి తేజ పోషించనున్నారు. ఈ చిత్రానికి ‘రణరంగం’ చిత్రం దర్శకుడు సుధీర్ వర్మ దర్శకుడు. మరి ఈ సినిమాలో రవికి ధీటుగా ఉండే ఆ మరో పాత్రను ఎవరు పోషిస్తారో వేచి చూద్దాం.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ