fbpx
Home Cinema మరోసారి నందిని రెడ్డి దర్శకత్వంలో నాని?

మరోసారి నందిని రెడ్డి దర్శకత్వంలో నాని?

హీరో నాని ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ అనే చిత్రం షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా తరువాత నాని ఇంకా మరే సినిమా సంతకం చేయలేదు. కారణం లేకపోలేదు, ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ తో సినిమా అనుకున్నారు కానీ ఆ సినిమా స్క్రిప్ట్ పై నాని అంత నమ్మకంగా లేడు .

నానిని దర్శకురాలు నందిని రెడ్డి సంప్రదించింది. నాని కోసం మరో రొమాంటిక్ ప్రేమ కధను రాసుకుందట. నాని సరే అంటే వెంటనే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వీరి కలయికలో ‘అలా మొదలైంది’ అనే సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఆ సినిమాతోనే నాని కి సరైన బ్రేక్ వచ్చింది. దాంతో నందిని రెడ్డి ప్రాజెక్ట్ ను ఒకే చేసే అవకాశం ఉంది అంటున్నారు నాని సన్నిహితులు. అన్నీ కుదిరి ప్రాజెక్ట్ ఒకే అనుకుంటే ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ తెరకెక్కించనుంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ