fbpx
Home Cinema గ్యాంగ్ లీడర్ లో ట్రైలర్ కంటే ఎక్కువ కామెడీ ఉంటుంది - నాని

గ్యాంగ్ లీడర్ లో ట్రైలర్ కంటే ఎక్కువ కామెడీ ఉంటుంది – నాని

నేచురల్‌ స్టార్‌ నాని, దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. టీజర్‌, ట్రైలర్‌ తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్‌ సాంగ్‌ తో సినిమాకు మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నాని చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
అప్పటికి నేను ‘జెర్సీ’ షూటింగ్‌ మొదలు పెట్టాను. విక్రమ్ నేను చాలా లైన్లు అనుకున్నాం కానీ ఒకరోజు అనుకున్నది బాగా నచ్చి ఈ షూటింగ్‌ అయిపోయేలోపు కథను సిద్ధం చేయమని చెప్పాను. అలా ‘జెర్సీ’ తరువాత ‘గ్యాంగ్‌ లీడర్‌’ మొదలు అయింది.

ఈ సినిమాలో నా పాత్ర పేరు పెన్సిల్‌ పార్థసారథి. ట్రైలర్‌లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ కామెడీ ఉంటుంది. దాదాపుగా చాలా సినిమాల్లో చూసుకుంటే రివెంజ్‌ అనే కాన్సెప్ట్‌ చాలా వైలెంట్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద డైలాగ్స్‌, ఫైట్స్‌ ఉంటాయి. అయితే రివెంజ్‌ అనే కాన్సెప్ట్‌ని వినోదాత్మకంగా చూపిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్‌ నన్ను బాగా ఎగ్జైట్‌ చేసింది. రేపు థియేటర్స్‌ లో మిమ్మల్ని మరింత అలరిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}