Home Cinema గోపీచంద్- తమన్నా చిత్రం ప్రారంభం

గోపీచంద్- తమన్నా చిత్రం ప్రారంభం

‘యు టర్న్‌’ వంటి సినిమా నిర్మించి హిట్ సాధించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రం ముహూర్తపు షాట్‌కి బోయపాటి శ్రీను క్లాప్‌ కొట్టగా, రాజమండ్రి ఎంపి మార్గాని
భరత్‌రామ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. గోపీచంద్‌ మాట్లాడుతూ – ”శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ శ్రీనివాస్‌గారితో, పవన్‌గారితో ఫస్ట్‌టైమ్‌ వర్క్‌ చేస్తున్నాను. వాళ్లు నాకు చాలాకాలంగా తెలుసు. కొన్ని కధలు అనుకున్నాం కానీ.. ఈ కధ బాగా పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. మంచి సినిమా చేయాలనే తపన ఉన్న నిర్మాతలతో సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.

దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ – ”ఈరోజు ఈ మూవీ లాంచ్‌ అవడానికి 1 టు 10 రీజన్స్‌ మా హీరో గోపీచంద్‌గారే. ఫస్ట్‌టైమ్‌ నేను ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా చేస్తున్నాను. దానికోసం చాలా రీసెర్చ్‌ చేశాను. గోపీగారు ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తున్నారు. తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. 25 మంది బ్యూటిఫుల్‌ ప్లేయర్స్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. బలమైన కథతో, విజువల్స్‌తో, ఎమోషన్స్‌తో ఫస్ట్‌టైమ్‌ ఈ కథ చేస్తున్నాను.

ఈ కథ చేయడానికి నా వెనకాల ఉన్న బలం చిట్టూరి శ్రీనివాస్‌, పవన్‌గారు. శ్రీనివాస్‌గారికి మాట ఇస్తున్నాను. మీ బేనర్‌లో పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుందని. అలాగే గోపీచంద్‌గారి ఫ్యాన్స్‌ గర్వంగా చెప్పుకునే సినిమా చేస్తాను. నవంబర్‌ నుండి మొదలై ఏప్రిల్‌ లో విడుదల చేద్దామనుకుంటున్నాం” అని అన్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ