fbpx
Home Cinema యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు సరసన రష్మిక `పొగ‌రు` విశేషాలు

యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు సరసన రష్మిక `పొగ‌రు` విశేషాలు

యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, కన్న‌డ హీరో ధృవ హీరోగా రూపొందుతోన్న చిత్రం పొగ‌రు . ఈ సినిమాలో ధ్రువ కి జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీ జ‌గ‌ద్గురు మూవీస్ బ్యాన‌ర్‌పై బి.కె.గంగాధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నంద‌కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఫ్రెంచ్‌ బాడీ బిల్డ‌ర్ మోర్గాన్ అస్తే, అమెరికన్ ఐ.ఎఫ్‌.బి.బి ప్రొఫెష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్ కై గ్రీనే, ఇంట‌ర్నేష‌న‌ల్ అథ్లెట్ ఎవాల్యుయేష‌న్ స్పోర్ట్స్ న్యూటీష‌న్ జాన్ లుకాస్‌, జర్మ‌న్ ఫిట్‌నెస్ సెన్సేష‌న్ జో లిన్‌డ‌ర్ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. కొన్ని రోజులుగా హైద‌రాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జ‌రుగుతోంది. హీరో ధృవ స‌ర్జాకు, ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్‌కు మ‌ధ్య జ‌రిగే క్లైమాక్స్ సినిమాకే
హైలైట్‌గా నిల‌వ‌నుంది. భైర‌వ‌గీత ఫేమ్ ధ‌నుంజ‌య్ ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. సంప‌త్ రాజ్‌, ర‌వి శంక‌ర్‌, ప‌విత్రా లోకేష్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ