fbpx
Home Cinema భారీ మొత్తానికి 'చాణక్య' రైట్స్

భారీ మొత్తానికి ‘చాణక్య’ రైట్స్

యాక్షన్ హీరో గోపీచంద్ తమిళ దర్శకుడు తిరుతో చేసిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘చాణక్య’. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో పాక్ బోర్డర్లో రా ఏజెంట్ గా గోపీచంద్ చేసే యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అవుతాయని తెలుస్తోంది. ఈ సినిమా పట్ల గోపీచంద్ నమ్మకంగా ఉన్నాడు.

ఇక ఈ చిత్రం వ్యాపార పరంగా బాగానే రాబట్టింది అని సమాచారం. తెలుగు శాటిలైట్ రైట్లకు 4 కోట్లు, అమెజాన్ డిజిటల్ రైట్లు 2 కోట్లు, హిందీ డబ్బింగ్ ఏకంగా 9 కోట్లు రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఇక చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. గోపిచంద్ కెరీర్ కు ఈ చిత్ర విజయం చాలా కీలకం.

ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహ్రీన్, జరీన్ ఖాన్లు నటిస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ శనివారం విడుదల కానుంది

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ