fbpx
Home Cinema ద‌స‌రా బ‌రిలోకి గోపీచంద్ `చాణ‌క్య‌`

ద‌స‌రా బ‌రిలోకి గోపీచంద్ `చాణ‌క్య‌`

గోపీచంద్ సినిమాలు వచ్చి హిట్ అందుకుని చాలా కాలం అయింది. దాంతో పట్టుదలగా ‘చాణక్య’ అనే యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్నాడు. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ సర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ