Home Cinema Box Office ‘గ్యాంగ్ లీడర్’ఇప్పటిదాకా కలెక్షన్స్

‘గ్యాంగ్ లీడర్’ఇప్పటిదాకా కలెక్షన్స్

రేపు వాల్మీకి :‘గ్యాంగ్ లీడర్’తట్టుకోగలదా!

‘నానీస్ గ్యాంగ్ లీడర్’వచ్చి వారం అయ్యింది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో బ్లాక్ బస్టర్ కొడతాడని నమ్మకంతో చేసాడు. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా కావంటోతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దానికి తోడు సాహో ఊపు కూడా తగ్గింది. ఇంత మంచి వాతావరణంలో సినిమా కుమ్మేస్తుంది అనుకుంటే… మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది.

ఈ సినిమా మొదటి వారంలో డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టినా..వీకెండ్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ బాగా పడిపోయాయి, కాగా తాజాగా ఏపీ అండ్ తెలంగాణలో ఈ సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఈ చిత్రం 15.2 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 29 కోట్లు కావడంతో, గ్యాంగ్ లీడర్ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. దానికి తోడు రేపు వరుణ్ తేజ్ వాల్మీకి రిలీజ్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే గ్యాంగ్ లీడర్ వాల్మీకిని తట్టుకుని నిలబడాల్సిన పరిస్దితి ఉంది.

<

p style=”text-align: justify”>ఈ చిత్రం వీకెండ్ లలో బాగానే కలెక్ట్ చేసినప్పటికీ సోమవారం నుంచి డ్రాప్ స్టార్టైంది. మాస్ సెంటర్లలలో ఈ సినిమా బాగా వీక్ గా ఉండటం దెబ్బ కొట్టింది. దాంతో రాబోయే రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయి…పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యి, లాభాల బాటలో పడతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ