Home Cinema షాకింగ్ :చేతబడి ట్రై చేస్తున్న రానా

షాకింగ్ :చేతబడి ట్రై చేస్తున్న రానా

చేతబడి కాన్సెప్ట్ తో రానా కొత్త సినిమా

దగ్గుపాటి రానా మొదటి నుంచీ రకరకాల కొత్త కాన్సెప్టులు ట్రై చేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా బాహుబలి చిత్రం తర్వాత రానాకు వచ్చిన క్రేజ్ అలాంటి,ఇలాంటిది కాదు. ఈ నేపధ్యంలో రానా మరో కొత్త చిత్రం కమిటైనట్లు సమాచారం. గతంలో సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసిన మిలింద్ రావు దర్శకత్వంలో రూపొందనుంది. ఇదో హర్రర్ సినిమా. ఈ సినిమాతో రానా ఓ రేంజిలో భయపెట్టనున్నారట. కథ వింటున్నప్పుడే ఆయన భయపడ్డారట. వెంటనే ఓకే చేసేసాడట.

భారత దేశంలో పురాతన విద్య అయిన చేతబడి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది. ఇది పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని రానా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాధ్ నిర్మించనున్నారు. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

తెలుగు,హిందీ,తమిళంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. మరో ప్రక్క రానా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రానా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ‘హాథీ మేరె సాథీ’.. ‘1945’ లతో పాటుగా ‘విరాటపర్వం’ షూటింగ్ దశలో ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘హిరణ్యకశ్యప’ కు జోరుగా ప్రీ ప్రొడక్షన్ సాగుతోంది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ