Home Entertainment Tollywood ‘జై చిరంజీవా’అని పచ్చబొట్టు పొడిపించుకుంది

‘జై చిరంజీవా’అని పచ్చబొట్టు పొడిపించుకుంది

చిరంజీవి అంటే అంత పిచ్చి ఆమెకు

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు చాలా మంది ఉంటారు. అలాగే వాళ్లలో ఆయన పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నవాళ్లు ఉంటారు. అలాంటి ఓ వీరాభిమాని ఓ థియోటర్ కోసం పోరాడితే ఎలా ఉంటుంది. ఇదే ఆలోచనతో ఓ దర్శక,నిర్మాత సినిమా చేసేసారు. అందులో హీరోయిన్ కు పచ్చ బొట్టు పొడిపించేసారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..ఆ కథేంటి అంటారా..

చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘అభిలాష’ ఆ అమ్మాయి పేరు. మరో సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ఆమె క్యారక్టర్. ఇక మెగా స్టార్ చిరంజీవి అంటే అభిలాషకు ఎంత పిచ్చి అంటే.. ‘జై చిరంజీవా’ అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత. ఇంతకీ ఈ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? ‘గ్యాంగ్ లీడర్’ గా ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ‘సురభి 70 ఎం.ఎం’ చూడాల్సిందే అంటున్నారు దర్శకనిర్మాత వై.గంగాధర్.

మెగా ఫ్యాన్ గా అందాల భామ అక్షత శ్రీనివాస్ నటిస్తున్న ‘సురభి 70 ఎం.ఎం’ చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్-అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ ప్రతిభాశాలి వై.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. ‘సురభి 70 ఎం.ఎం’ అనే ధియేటర్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్ తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె ‘గ్యాంగ్ లీడర్’ ఎలా అయ్యింది? వంటి ఆసక్తికర విషయాలు వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు దర్సకనిర్మాత వై.గంగాధర్.

అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘స్వతహా మెగా స్టార్ కు పెద్ద ఫ్యాన్ అయిన నాకు ‘సురభి ’70 ఎం.ఎం’లో మెగాభిమానిగా గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత కల ‘అభిలాష’ అనే పాత్రలో ‘లేడి గ్యాంగ్ లీడర్’గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకుగాను మా దర్శకనిర్మాత గంగాధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం నా కెరీర్ ను మలుపు తిప్పుతుందని నమ్మకంగా చెప్పగలను. మా బాస్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ‘సైరా’ సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...

మ‌హేష్‌ని ఒప్పిస్తే మొన‌గాడే.. కుర్ర డైరెక్ట‌ర్ టెన్ష‌న్

స్క్రిప్టు లేనిదే ఏదీ లేదు. క‌థ క‌థ‌నం స‌రిగా కుద‌ర‌నిదే అస‌లు సినిమానే లేదు. ఇదీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ పంథా. ఆయ‌న ఒక స్క్రిప్ట్ ను లాక్ చేయాలంటే ద‌ర్శ‌కుడు ఎన్ని...

మెగాస్టార్ ఆ నెపం జ‌క్క‌న్న పైకే నెట్టేశారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 152వ చిత్రం `ఆచార్య‌`లో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేదా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కానీ న‌టించే ఛాన్సుంద‌ని కొద్ది రోజులు...

కొర‌టాల నిర్ణ‌యం షాకింగ్‌గా వుందే!

స‌మాజ హితం కోసం స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ చేయ‌ని త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న‌కు అభ్యుద‌య భావాలు ఎక్కువే. ర‌చ‌యిత‌,...

ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్...

మెగాస్టార్ ఏంటీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు?

`సైరా` త‌రువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స్వ‌యంగా చిరు వెల్ల‌డించారు. క్రేజీ...