fbpx
Home Cinema పవన్ పుట్టిన రోజు..చంద్రబాబు ఏమన్నారో తెలుసా

పవన్ పుట్టిన రోజు..చంద్రబాబు ఏమన్నారో తెలుసా

పవన్ కు బర్తడే విషెష్ తెలిపిన చంద్రబాబు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు పవన్‌కల్యాణ్‌కు సోషల్‌మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపటం విశేషంగా మారింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

‘ తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించి, విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తోన్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై, సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.

మరో ప్రక్క తెలుగుదేశం పార్టీకు, జనసేన కు సీక్రెట్ గా స్నేహం ఉందంటూ ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు ఈ రోజు కూడా మరోసారి పవన్ పై విరుచుకు పడ్డారు.   ఇదివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్… టీడీపీని ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. ఎప్పుడూ వైసీపీ, జగన్‌నే ప్రశ్నించడాన్ని ప్రజలు చూశారన్నారు. గత ప్రభుత్వ అక్రమాల్ని తాము తవ్వితీస్తుంటే… తమనే పవన్ ప్రశ్నిస్తుండటం చూస్తుంటే… జనసేన అజెండా మారలేదనీ, ద్వంద్వవైఖరి ఏంటో అర్థమవుతోందనీ అన్నారు. జనసేన తీరు చూస్తుంటే… అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు ఉందన్నారు

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}