fbpx
Home Cinema రామోజీ ఫిలిం సిటీ లో బాలకృష్ణ చిత్రం రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం

రామోజీ ఫిలిం సిటీ లో బాలకృష్ణ చిత్రం రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం

నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రంలో ప్రేక్షుకులకు తనను ఇంతవరకు చూడని వేషధారణలో కనిపించి ఆనందం కలిగించనున్నారు. తన ఈ 105 వ చిత్రం హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ తెరకెక్కిస్తున్నారు. సి.కల్యాణ్ చిత్ర నిర్మాత. జైసింహా చిత్రం త‌ర్వాత మళ్ళీ ఈ కలయికలో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. ఇటీవ‌లే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ నిన్నటి నుండి రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైంది.

ఈ షెడ్యూల్‌లో భాగంగా అన్బు, అరవి అధ్వ‌ర్యంలో భారీ పోరాట స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌కృష్ణ రెండు వైవిధ్యమైన లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఇటీవ‌ల విడుద‌లైన ఓ లుక్‌కి, పోస్ట‌ర్స్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ