fbpx
Home Politics దేశ రాజకీయాల్లో బిజేపి పతనం మొదలైందా?

దేశ రాజకీయాల్లో బిజేపి పతనం మొదలైందా?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తే ఎవిరికైనా ఏమనిపిస్తుంది? ఈ దేశమంతా బీజేపీ వెనకాల నిలబడి మీకు మేమంతా అండగా వున్నాము మీరు మాకు సరైన పాలన అందించండని చెప్పినట్టుంది. అయితే బీజేపీ ఆ తిరుగులేని అధికారాన్ని పాలన కంటే రాజకీయాలు చెయ్యడానికే ఎక్కువ వాడుతున్నట్టు వుంది. ఉదాహరణకు ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఆ రాష్టంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీల నేతల మీద సిబిఐని ప్రయోగించడం లేకుంటే పాత కేసులు తిరగదోడి బ్లాక్మెయిల్ చెయ్యడం, IT రైడ్లు చేసి వారిని లొంగదీసుకోవడం. ఒకవేళ ఫలితాలు వెలువడిన తర్వాత సంకీర్ణ తీర్పు వస్తే ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలు లేకుంటే గవర్నర్ కార్యాలయాన్ని వారికి అనుకూలంగా వాడుకోవడం తరచుగా కనిపిస్తుంది. కర్ణాటక మరియు మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లులో బీజేపీ అవలంబించిన విధానాలే ఇందుకు నిదర్శనం. తాజాగ మహారాష్ట్ర రాజకీయంతో బీజేపీ ఎంత దిగజారగలదో దేశానికి చూపించింది.

గతంలో కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ ఇటువంటి పనులు చాల చేసేది. ప్రజలు ఒక మోతాదు వరకు చూసీచూడనట్టు వదిలేస్తారు. కానీ ప్రతిదానికి ఒక బ్రేకింగ్ పాయింట్ వున్నట్టే ప్రభుత్వాలకి ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే బొగ్గు కుంభకోణం బయటకి వచ్చిందో అప్పటినుండి రోజురోజుకి కాంగ్రెస్ మీద ప్రజలకి వ్యతేరేఖత పెరుగుతూ వచ్చింది. అలాగే కాంగ్రెస్ కూడా అప్పటినుండి రాజకీయంగా తప్పులు మీద తప్పులు చెయ్యడం మొదలుపెట్టి 2014 ఎన్నికల్లో ఒక గల్లీ పార్టీ స్థాయిలో 45 సీట్లతో సరిపెట్టుకుంది.

ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన రాజకీయతంతు ప్రజల్లో ఏహ్య భావం కలగడానికి బీజేపీ పతనానికి మొదలులాగా అనిపిస్తుంది. ఇది బీజేపీ అభిమానులకి అమిత్ షా సాధించిన విజయం లాగా అనిపించవచ్చు కానీ నిజానికి ఇది బీజేపీకి అన్ని విధాలా నష్టం చేకూర్చే విజయం. NCP శివసేన మరియు కంగ్రెస్ కూటమితో ఏర్పాటయ్యే ప్రభుత్వం ఖచ్చితంగా కొంత కాలానికి విఫలం అయ్యేది. కారణం ఆయా పార్టీల నాయకత్వానికి వున్న భిన్న అభిప్రాయాలు , రాజకీయ ప్రయోజనాలు. అయితే ఇప్పుడు అమిత్ షా చేసిన పనికి వారు సంఘటితంగా పని చేసే అవకాశం వుంది.

ఫడ్నవిస్ కి వున్న క్లీన్ ఇమేజ్ అంతా ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం దేశానికి గవర్నర్ వ్యవస్థని బీజేపీ ఎలా ఆడిస్తుందో తెలిసివచ్చింది. బీజేపీ/RSS ఎప్పుడు చెప్పే నీతి సూత్రాలకు తిలోదకాలు ఇచ్చినట్టయ్యింది. అజిత్ పవార్ 25000 కోట్లు అవినీతి చేసాడని కోడై కూసిన బీజేపీ అతన్ని ఉపముఖ్యమంత్రిగా చేసి ఆ ఆరోపణలలో వున్న అవినీతి మకిలిని బీజేపీ అంటిచుకున్నట్లయ్యింది. రామ జన్మభూమి ఆర్టికల్ 370 తో వచ్చిన పాజిటివ్ ఇమేజ్ ఒక పొరపాటుతో బీజేపీ కోల్పోయినట్టనిపిస్తుంది . రాజకీయాల్లో పడిపోవడం మొదలైతే తిరిగి చూసేలోపే అధఃపాతాళనికి చేరిపోతారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ