fbpx
Home Cinema మ్యూజిక్ డైరక్టర్ మత పిచ్చిపై మండిపడ్డ అనంత్ శ్రీరామ్

మ్యూజిక్ డైరక్టర్ మత పిచ్చిపై మండిపడ్డ అనంత్ శ్రీరామ్

అనంత్ శ్రీరామ్ మండిపడ్డ మ్యూజిక్ డైరక్టర్ ఎవరో..

ఈ జనరేషన్ భావాలకు అనుగుణంగా పదబంధాలు పేర్చి పసందైన పాటలు రాయడంలో దిట్ట అనంత్ శ్రీరామ్. ఆయన పలికించిన పాటల్లో సాహిత్యం తొణికిసలాడుతుంది. బాల్యం నుంచే తెలుగు సాహిత్యంవైపే పరుగులు తీసి .. ఆ తపనతోనే చిత్రసీమలో ప్రవేసించిన శ్రీరామ్ ఇక్కడా అదే స్దాయిలో పరుగు తీస్తాడని, అతి కొద్ది కాలంలోనే జనం మెచ్చే పాటలు రాస్తాడనీ ఎవరూ ఊహించలేదు. వచ్చీ రాగానే స్టార్ హీరోల చిత్రాలకు పరవళ్ళు తొక్కించే పాటలురాసి పాపులర్ అయిన శ్రీరామ్ తన మనస్సుకు నచ్చినవారితో పనిచేయటానికి ఇష్టపడతారు. అలాగే తన మనస్సులో మాటని మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అలాంటి మాటనే తాజాగా అలీ తో జాలీగా పోగ్రామ్ కు వచ్చి పంచుకున్నాడు.

అందరి మన్ననలూ పొందిన బాలెట్ సాంగ్ రాయించుకున్న కంపోజర్ రీసెంట్ గా తనని ఇబ్బంది పెట్టారన్నారు. వేరే మతానికి చెందిన ఆయన తను రాసిన పాటలో ఓ హిందూ దేవుడు పేరు ఉండటం గమనించి ఆ పాటని కంపోజ్ చేయలేదని అన్నారు. వృత్తిని, మతాన్ని కలిపి చూడటం నచ్చలేదన్నారు. అయితే తనకా కంపోజర్ పేరు బయిటపెట్టడం ఇష్టం లేదని, అతని పబ్లిక్ ఇమేజ్ పైనా, కెరీర్ పై పడుతుందని అని అన్నారు.

దాంతో సోషల్ మీడియా మొత్తం ఎవరా కంపోజర్ అని రకరకాలుగా స్పెక్యులేషన్ చేస్తున్నారు. కొంతమందైతే పేరు బయిటకు చెప్పలేనప్పుడు అసలు ఆ టాపిక్ ఎత్తటం ఎందుకు అని అనంత్ శ్రీరామ్ పై మండిపడుతున్నారు. అసలు ఎవరా మ్యూజిక్ డైరక్టర్ అనేది తెలియాలంటే అనంత్ శ్రీరామ్ చెప్పాల్సిందే.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ