fbpx
Home Cinema ‘అల వైకుంఠపురములో..’ రిలీజ్ డేట్ పోస్టర్

‘అల వైకుంఠపురములో..’ రిలీజ్ డేట్ పోస్టర్

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ కు గుడ్‌ న్యూస్‌

బన్నీ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తారని వార్తలు మొదట నుంచి వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ పోస్టర్ విడుదల చేసారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల కాబోతుందని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, బన్నీ డైలాగ్‌, ‘సామజవరగమన’సాంగ్‌, పోస్టర్‌ ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తర్వాత ఓ ఫారిన్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. సుశాంత్, నివేదా పేతురాజ్, జయరామ్, టబు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ