Home Cinema లుంగీ కుర్రాడిగా అఖిల్

లుంగీ కుర్రాడిగా అఖిల్

యువ నటుడు అఖిల్ ఇంత వరకు ప్రేమికుడిగా ఒక సిటీ కుర్రాడిగా కనిపించాడు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో అఖిల్ ఒక పల్లెటూరి కుర్రాడిగా కనిపించనున్నాడు. ఇందుకోసం అతను లుంగీ అవతారంలో కనిపించనున్నాడు.

రాజశేఖర్ తో ‘కల్కి’ సినిమా తరువాత సరైన హిట్ కోసం చూస్తున్నాడు ప్రశాంత్. అఖిల్ కోసం చెప్పిన కథ నచ్చి ప్రశాంత్ సినిమాకి సరేనన్నాడు అఖిల్. దాంతో ఇప్పుడు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అన్నీ కుదిరితే వీళ్లిద్దరి సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది.

ప్రస్తుతం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ