Home Cinema మోహ‌న్ లాల్ చుట్టూ బిగిస్తోన్న కేసు,కోర్ట్ కు

మోహ‌న్ లాల్ చుట్టూ బిగిస్తోన్న కేసు,కోర్ట్ కు

మర్చిపోయిన కేసు మోహన్ లాల్ ని వెంబడిస్తోంది

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ మళ్లీ చిక్కుల్లో ప‌డ్డారు. 2012లో మోహన్ లాల్ ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేరళ ఎర్నాకుళంలోని కోర్టులో అతనిపై చార్జిషీట్ దాఖలైంది. ఈయనపై కేస్ నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని చూస్తున్నారు అటవీ శాఖ అధికారులు.

తాను కె కృష్ణన్‌ అయ్యర్‌ అనే వ్యక్తి నుంచి 65 వేల రూపాయలకు వీటిని కొనుగోలు చేశానని మోహన్‌లాల్ గ‌తంలో చెప్పుకొచ్చాడు. కాగా ఈ వివాదంకి సంబంధించి తాజాగా కేసు హైరింగ్ రాగా, కేర‌ళ ప్ర‌భుత్వం ఏనుగు దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు సరైన అనుమతి లేదని తేల్చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఈయనకు ఎలాంటి అనువైన అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో కేస్ మళ్లీ మొదటికి వచ్చేసింది.

దాంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3)తో మోహన్‌లాల్‌పై నేరం రుజువు చేయొచ్చని హైకోర్టు తేల్చడం సంచలనంగా మారింది. సూపర్ స్టార్ కావడంతో ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా పిటిషనర్‌ హైకోర్టును కోరాడు. అప్పట్లో మోహన్ లాల్ ఇంట్లో సోదాలు చేసినపుడు కూడా ఐటీ అధికారులు ఆ దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోహ‌న్ లాల్ న‌టించిన తాజా చిత్రం క‌ప్పాన్. తెలుగులో ఈ చిత్రం బందోబ‌స్త్ అనే పేరుతో విడుద‌లైంది. కానీ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ