Home Cinema వేణు శ్రీరామ్ కు బన్ని హ్యాండ్ ఇవ్వటానికి కారణం

వేణు శ్రీరామ్ కు బన్ని హ్యాండ్ ఇవ్వటానికి కారణం

వేణు శ్రీరామ్ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్‌ సినిమాతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌, సుకుమార్‌ డైరక్షన్‌లో మరోటి.. ఒకేసారి అనౌన్స్‌ చేశాడు. ఆ ఎనౌన్సమెంట్ తో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఇపుడు… వేణు శ్రీరామ్ సినిమాకు బ్రేకులు పడినట్లు సమాచారం. సుకుమార్‌ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలల్లో లాంచ్‌ చేయాల్సి రావటం… దానికి తోడు త్రివిక్రమ్‌ సినిమా పూర్తి చేయాల్సి ఉండటంతో బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దానికి తోడు వేణు శ్రీరామ్‌ సినిమాకి భారీ బడ్జెట్‌ అవసరం అని, హడావిడిగా అలాంటి సినిమా చేయకూడదని దిల్ రాజుకు, వేణు శ్రీరామ్ కు ఆల్రెడీ చెప్పేసారట. దాంతో వేణు శ్రీరామ్ కొంతకాలం ఆగి ఆ ప్రాజెక్టుని మెటీరియలైజ్ చేద్దామా లేక వేరే హీరోతో ముందుకు వెళ్లాలా అనే విషయంలో డైలమోలో ఉన్నారట.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ఇప్పుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. తన హోమ్‌ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌తో కలిసి హారికా హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్‌ విలన్‌గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ టబు, మలయాళ నటుడు జయరామ్‌, మురళీ శర్మలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ